*అక్షర మాల గేయాలు**సంయుక్తాక్షర గేయం గ -ఒత్తు*:-*వురిమళ్ల సునంద, ఖమ్మం*

 భార్గవి సద్గుణ మంచి బాలలు
నాల్గవ తరగతి చదువుతున్నరు
ఒకరోజు శివాజీ పాఠం విన్నరు
ఖడ్గం అంటే ఏమిటని అడిగారు
మనసుంటే మార్గం ఉంటుందని
సద్గురువు దగ్గరకు పిలిచి చెప్పగా
నిఘంటువు ఇద్దరు తిరగేశారు
ఖడ్గమంటే కత్తని తెలుసుకున్నరు

కామెంట్‌లు