బంకించంద్ర ఛటర్జీ తీర్పు!...అచ్యుతుని రాజ్యశ్రీ

 వందేమాతరం మందే భారతం!ఆనందమఠం అనే బెంగాలీ నవల రాసిన బంకిం చంద్ర ఛటర్జీ  ఆపాటని అందులో రాసి ప్రపంచ ఖ్యాతి గడించారు. ఆయనను గురించి న అద్భుత ఘట్టం ఇది.చదవండి. ఆయనబర్దవాన్ మేజిస్ట్రేట్ గాఉన్నరోజులలో జరిగింది. ఒక వ్యక్తిని దొంగతనం చేశాడు అనిబంకిం దగ్గరకు తెచ్చారు. ఆయన ఇలా మొత్తుకున్నాడు "అయ్యా!నేను కలకత్తా లో అధ్యాపకునిగా పనిచేస్తున్నాను.నాకొడుక్కి బాగా జబ్బు చేసింది అన్న సమాచారం అందటంతో మా పల్లెకు బైలుదేరాను టెలిగ్రామ్ అందగానే! రాత్రి కావటంతో ప్ర యాణసాధనాలులేక ఒక గ్రామం లో బస చేశాను.నిద్ర పట్టక దొర్లుతున్నాను.ఆతనిఇంటిలోపలనించి చప్పుడు వినపడింది.ఒక పోలీస్ చేతిలో పెట్టెతో ఉడాయించటం చూసి అతన్ని గట్టిగా పట్టుకున్నాను.పోలీసు ఇలా అన్నాడు"మనిద్దరం  పెట్టెలోది చెరిసగం పంచుకుందాం".నేను అలాంటి పాపపుపని చేయనని  ఖరాఖండిగా చెప్పాను.అంతే అతను బిగ్గరగా "దొంగ..దొంగ!"అని అరవటంతో అంతా లేచి నన్ను  చుట్టుముట్టారు.దానికి తగినట్టుగా నావేషం ఉంది. పూర్వజన్మ పాపంవల్ల మీముందు దోషిగా నిలబడ్డాను."ఆయన బాధ అవమానం తో కుళ్ళిపోసాగాడు.బంకిం బాబు కి అతను నిజం చెప్పుతున్నాడు అనిపించింది.కానీ జనం పైపైపటాటోపాలకి బోల్తాపడతారు.పోలీస్ దొంగతనం చేసి ఆయనపై నెడుతున్నాడు అని గ్రహించాడు. ఆరాత్రంతా ఆఅమాయక అధ్యాపకుని ఎలా రక్షించాలా అనే ఆలోచన తోగడిపాడు బంకింబాబు. ఆమరునాడు కేసు ప్రారంభించారు. కోర్టు బోనులో ఆవ్యక్తి దిగాలుగా ఉంటే పోలీస్  పెట్టెతో ధీమాగా ఉన్నాడు. సరిగ్గా అప్పుడే ఒకతను కోర్టు లో కొచ్చి"సార్!రోడ్డు పైన ఎవరో ఒకడిని హత్య చేసి మంచంతో సహా వదిలిపారిపోయారు."అంతే!బంకిం బాబు పోలీస్ తో అన్నారు "ఈ ముద్దాయి నీవు మంచంతో సహా ఆశవాన్ని ఇక్కడకు ఇప్పుడే తేవాలి."అనటంతో ఇద్దరు ఆశవం ఉన్న చోటుకి వెళ్ళారు.రోడ్డు పై మంచంలో శవంఉంది.దానిపై రక్తపుమరకల దుప్పటి కప్పిఉంది.ఆఇద్దరూ మంచాన్ని నెత్తిపై మోస్తూ నడవసాగారు.అధ్యాపకునితో పోలీస్ అన్నాడు"ఏమయ్యా పిచ్చి పంతులూ!నేను చెప్పినట్లుగా నీవు వింటే నీకు ఈఖర్మ పట్టేది కాదు. ఇద్దరం డబ్బు తో ఉడాయించేవారం.జైలు లో జీవితాంతం కుళ్ళిపో!" "పోలీసూ!ఆ ఇంటి యజమాని నేను ఎవరో తెలీకున్నా ఆరాత్రి నాకు అన్నంపెట్టి ఆశ్రయంఇచ్చాడు.తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే ద్రోహిని కాను.నీతినిజాయితీ నాప్రాణం.ఉరికంబం ఎక్కుతా."
ఇద్దరూ మంచంతో సహా కోర్టు హాల్లోకి ప్రవేశించారు.
కేసువిచారణ ప్రారంభమైంది. పోలీస్ అధ్యాపకుడు తమ వాదనలు వినిపించారు. ఇంతలో హఠాత్తుగా మంచంపై ఉన్న శవం దుప్పటి తొలగించి లేచి నించునిఅరిచింది"సార్!పోలీస్  నిజమైన దొంగ.వీరి ఇద్దరిమధ్య జరిగిన సంభాషణ  నేను వింటూ పడుకున్నాను."అంతే పోలీస్ కి శిక్ష పడింది. అమాయక అధ్యాపకుని గౌరవ మర్యాద లతో సాగనంపాడు బంకిం చంద్ర ఛటర్జీ. మంచంపై శవాన్ని  మోయించి నిజం రాబట్టిన న్యాయమూర్తి  దేశభక్తుడాయన.
కామెంట్‌లు