*ద్విత్వాక్షర గేయాలు**త-త్త ఒత్తు పరిచయం*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం*

 ఉత్తరం రాయాలని పొత్తమొకటి తెచ్చాను
ముత్తెంలా రాయాలని ఆరాట పడ్డాను
రాత చెత్తగుందనీ కాగితాలు చించాను
చిత్తు కాగితాలు ఏరి చెత్తలో పడవేశాను
కొత్త కాగితమొకటి మరల తీయబోతుంటే
చెత్తలోని కాగితం గాలికి ఎగురుతు వచ్చి
విత్తముతో కొని తెచ్చినది కదా 
పొత్తమనీ
మెత్తగ నను మందలించి చెత్తలోకి జారింది

కామెంట్‌లు