మాతృదేవత--డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,మేడ్చల్.

 తొలిదైవం,తొలిమాట అమ్మే.
జన్మనిచ్చి,కడుపులో పెట్టుకొని,
కాపాడే దేవత తల్లే,
బిడ్డ ఆకలి గమనించి, 
అడక్కుండానే అన్నంపెట్టి,
దీవించే కరుణామయి జనని.
సేవలెన్నో చేసి,వేలుపట్టి నడిపించి,
గోరుముద్దలతో సంస్కారం నేర్పి,
నిరంతరం తపించే మహాదాత మాత.
తల్లిని పూజించాలి,సేవించాలి.
వయసు మళ్ళిన నాడు 
చేయూతై తోడుండాలి.
నడిచే దైవాన్ని అనునిత్యం కాపాడాలి.
అమ్మ ఋణం తీరదు ఎన్ని జన్మలకైనా,
తల్లి ఆశీర్వాదమే శ్రీరామరక్ష.
కామెంట్‌లు