పరివారం(వచనకవిత)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,మేడ్చల్.

 మనము అనే భావనే ముఖ్యమై
ఒకరికొకరుగా తపించే మనస్సే ప్రధానమై
రక్తసంబంధం,అనురాగబంధం ఒక్కటై
మమతల,మమకారాల
ప్రాకారాలు పునాదై
అహర్నిశం రక్షణగా,తోడూ-నీడగా ఏర్పాటై
సమష్ఠి ప్రణాళికతో అల్లుకున్న పొదరిల్లై
గౌరవం,భద్రత లకు
సంతోషాలకు,సరదాలకు ఆలవాలమై
నిలిచేదే కుటుంబం
ఎన్ని సమస్యలొచ్చినా,
కలతలొచ్చినా,అభిప్రాయ భేదాలున్నా,కుటుంబమే
మన అస్తిత్వం.
కామెంట్‌లు