మంగళ మహా శ్రీ వృత్తము.:--- మచ్చ అనురాధ-తెలుగు భాషోపాధ్యాయురాలు--జి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.

 అమ్మవారి స్తుతి
భారతి భవాని మిముభావ మున 
నిల్పితినివాణికరుణించుమిక తల్లీ,
హారతు లొసంగెద దయన్ గనియు కావ్యమరయంగ రచనన్ గరుప నీదే ,
భారమని వేడితిని భవ్యముగ  తీర్చిననుపావనమునొందగను  జేయన్ ,
కోరుతు సదా కవనకోకిలగ నుంచుమని కొల్చుచు పదమ్ములను  వీడన్.

తరళవృత్తము.
వరమును నిడుమనియు గుడికివడివడిగను దరికినే ,
కరమున విరులుగొని నడచి ఘనముగ మనమునను నే ,
మరువకను నిను తలచుదును మనసున రచనలనిడన్ ,
శరణము తెలుపుదును జనని సవినయముగనే.

కామెంట్‌లు