ఆట వెలదులు (చిత్ర పద్యం ) మా పల్లె :----. ఎం. వి. ఉమాదేవి . నెల్లూరు
పచ్చ గాను నవ్వు పంటచేలనుజూడు 
కాలి బండ్ల బాట కథలు జెప్పు 
చెరుకు తోట లోన చెలగువయ్యారము
బడికి వెళ్ళు చున్న బాలలరు గొ !

గుడికి వెనుకగాను  గున్నమామిడితోట 
చింత చెట్లకింద చిన్న గుడిని 
పూరి కప్పు తోడ పుట్టెడిళ్లవియుండె 
తోటకూర మడియు తోవ ప్రక్క!


కామెంట్‌లు