శ్రీ సరస్వతి దేవి (ఆట వెలదులు):--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
మదియు శారదాంబ మందిరమగుగాక 
కరుణ జూపు మనుచు కవితలల్ల
మూలభావనలిడి మూర్తిమత్వమునిచ్చు 
వాణి జయ  శుభములు  వరములొసగు !

బాసరందు వెలసి బహుచక్కనీతల్లి 
లేశమంత యూహ లీయవమ్మ 
అక్షరమ్ము లవియు  నక్షయపాత్రవలె 
కురియవలెను మాకు కూర్మి తోడ!


కామెంట్‌లు