*నవ్వులు-కర్తవ్యం!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 100.నవ్వులు పెంచు!
        నవ్వులు పంచు!
        నవ్వుల్లో మించు!
        నవ్వుల్లో రమించు!
101.నవ్వే ప్రతి క్షణం!
        అది,ఆయుపోషణం!
       సకల దుఃఖశోషణం!
       సర్వజన సంతసకారణం!
102.నవ్వడానికి స్మృతులు!
       నవ్వించడానికి జతులు!
       నవ్వలేని గతులు!
       మనకెందుకీ మతులు!
103.నెలనెల వెన్నెలలు!
      నదీతీరాన ఇసుకతిన్నెలు!
       సముద్రతీరాన అలలు!
       నవ్వుల తరగని గనులు!
104.
    ప్రపంచం ఓ నవ్వులమేళా!
    నవ్వే లేకుంటే అదో కబేళా!
    నవ్వుల దారంట కదలిరా!
  నవ్వుల రాములోర్ని కలవరా!
            (కొనసాగింపు)

కామెంట్‌లు