కరోనా దండకం :-మచ్చ అనురాధ.సిద్దిపేట.

 చైనాలో జన్మించి చైనీయు లెందర్నొ,
 చెల్లాచెదుర్లూగ చేసావు నీ మాయ ,
 నీ లక్షణాలన్ని చిత్రంబు వింటుంటె ,
 గుండెల్లొ దప్పుల్ల మోతల్ని  మ్రోగిస్తు ,
ఊహాను లోనీవు  నీవిశ్వ రూపాన్ని ,
దర్శింప జేసేసి  వేలల్లొ మారించి ,
 దేశాలు ప్రాకేసి మా దేశమెుచ్చావు ,
 నీ చూపుతో దేశ సంపాదనన్ కొల్ల ,
 గొట్టావు ప్రాణాలు తీసేసి మాంగళ్య ,
 ముల్ దెంపి శోకంబు  పెట్టించి ఊరూర  ,
నీ నృత్యమున్ జూపి నీ ముద్రలున్ వేసి ,
కూలీల గుడెల్లొ  సూదుల్ని గుచ్చేసి ,
కూడైన లేకుండ  ఘోరంగ జేసావు , 
మానుష్య జన్మందు బంధాలు పోగొట్టి ,
ఆత్మీయ మాటల్ని దూరంబు జేసేసి , 
దారిద్ర్యమున్ నింపి  గండంబు గా నిల్చి ,
దండించ తేడాలు లేకుండా వేంచేసి ,
వీరాది వీరుల్ని శూరాది శూరుల్ని,
నీగుప్పిటన్ బట్టి యాడించి మాడ్చావు ,
నీ వాడు నా వాడనీ లేదు సర్వంబు ,
తానైకరోనా యె రాజ్యంబు పాలించె ,
నీరూపు మూలాలు మా భారతీయంబ ,
 పుత్రుండ్లు  మేధావి లోకంబు నున్నారు ,
నీ పుట్టు పూర్వోత్తరాలున్ కరోనాను ,
నాశనం చేసేడి మందుల్ని సృష్టించి ,
నీరాక గుర్తించి
నీయంతు తేల్చేరు , 
అందాక ప్రాణాలు జాగ్రత్త కాపాడు ,
కోవాలి కోవిడ్ కోరల్లో చేరొద్దు ,
స్వార్థంబు పెంచావు మాలోన ప్రాణాల ,
మోహమ్ము లో మేము  కోవీడు  సోకంగ   ,
వారందరిన్ జూసి ఘోరంగ  చూడంగ ,
ఓదార్పు లేదాయె గుండెల్లో మృత్యువు ,
నాదాలు మ్రోగగా ప్రాణాలు కోల్పోయె ,
కో వీడు నాశంబు జేసేటి వ్యాక్సీను ,
అంగట్లొ కొచ్చేంత కాలమ్ము జాగ్రత్త ,
సాంఘిక దూరమ్ము పాటించి మూతుల్ని,
మూసేసి  పెండ్లిళ్లు పేరంట ముల్  వద్దు,
ఇల్లే కదా స్వర్గసీమంటు ఇంట్లుండి ,
జీవంబు  సాగించ మేలౌను  తెల్యుండి ,
లోకాలనేలే టి లోకేశ్వరా మమ్ము ,
రక్షించ రావయ్య మమ్మేల జాగేల ,
దేవాది దేవుండ యోదీన బంధుండ
రావా  నమస్తే నమస్తే నమః

కామెంట్‌లు