*అక్షర మాల గేయాలు* *ర- ర్ర ఒత్తు పరిచయం*:- *వురిమళ్ల సునంద,ఖమ్మం*

 మర్రి చెట్టుకు తొర్రుంది
తొర్రలో బుర్రు పిట్టుంది
బుర్రమీసం గొర్రెల కాపరి
గిర్రు గిర్రున మీసం తిప్పిండు
బర్రె మీద ఎగిరి కూసుండు
మర్రితొర్రను చూసిండు
బుర్రుపిట్టను పట్టబోయిండు
జర్రున జారి కింద పడ్డడు

కామెంట్‌లు