పద్యం (రైతు)జె.నిర్మల తెలుగు భాషోపాధ్యాయురాలుజిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కొండపాక
 
కందం:
శ్రీ కర కరమే  రైతుది
ప్రాకటముగ లోకమందు పరికింపంగన్
ఆకలి దీర్చే దాతయు
సాకును జనులందరినిల  చాలగ నెపుడున్
కందం:
కాలము మారిన రైతుకు
మేలింతయు గల్గకుండె మేధిని లోనన్
కలకాలము కష్టబడును
ఇలలోనను నెపుడు మారు నీతని బ్రతుకున్


కామెంట్‌లు