పాట:-యెల్లు అనురాధ రాజేశ్వర్ రెడ్డి

 ఓ ఓ ఓ ఓ
ఆ ఆఆఆఆ
అమ్మ దుర్గమ్మ తల్లి
 నువ్వు అది కొస్తే మనసు మురిసి నట్టు ఉంటాది 
అమ్మ దుర్గమ్మ తల్లి ::అమ్మ::
మహా వన దుర్గ  విజయవన దుర్గ 
 ఆది పరాశక్తి లలితా భవాని 
శివ నంద శక్తి శంకర దేవి 
వనమున వెలిసిన దుర్గమ్మ తల్లి::అమ్మ::
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు
 సృష్టించిన మూలశక్తి 
అష్టాదశ పీఠాలను అధిరోహించిన ఆది శక్తివి
జగాలనెలే జగన్మాత వు
::అమ్మ::
కంచిలోని కామాక్షి నీవే 
మధురలోన మీనాక్షి నీవే 
కాశీలో  విశాలాక్షి వీ
కలియుగ మందున కనకదుర్గ వు
::అమ్మ:: 
మహిషాసుర మర్దిని వమ్మ 
అండ పిండ బ్రహ్మాండ మందున
 నిండి ఉన్న వన మాదుర్గవమ్మ
 అండదండగా తోడు ఉండంమ్మ
 ఆనందాలను మాకివ్వమ్మా
::అమ్మ::
కామెంట్‌లు