అమ్మభాషకు వందనం: - రామ్మోహన్ రావు తుమ్మూరి

అమ్మభాషకు వందనం
అమృతభాషకు వందనం
తేనెకన్నా తీయనైనది
తెలుగు భాషకు వందనం /అమ్మ/

అమ్మ ఆవు ఇల్లు ఈల
ఉడత ఊయల ఎలుక ఏనుగు
ఎంత కమ్మని తెలుగు రా
ఎంత చల్లని వెలుగురా /అమ్మ/

కలప గడప చిలుక జల్లెడ
టముకు ఢంకా తలపు దువ్వెన
దేశభాషల తెలుగు లెస్స ని
కృష్ణరాయల మాటరా.   /అమ్మ/

పలక బలపము మనసు యాగము
రవళి లవణము వలపు శరణము
అందమైనవి అలతి పదములు
వినగ సొంపగు భాషరా  /అమ్మ/
 
సరుకు హారము క్షణము ఱంపము
తెలుగు పదముల మాలతో
గిడుగు పిడుగును తలచి మదిలో
తెలుగు భాషను కొలుచుకుందాం 
 /అమ్మ/
కామెంట్‌లు