శ్రావణ మాసం--.. శ్రావణ లక్ష్మికి స్వాగతం :--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
చిరునవ్వుతో అరుదెంచే శ్రీలక్ష్మి 
శ్రావణమాసాన శుభాకాంక్షలతో 
ముగ్గుల్లో మహాలక్ష్మి 
గడపలో గజలక్ష్మి 
పువ్వుల్లో కమలినీ 
నవ్వుల్లో నాగవల్లీ !స్వాగతం!

అడపా దడపా మేఘాలజల్లు 
కొత్త చిగుళ్ల మొగ్గలు 
తొంగి చూసే తరువుల్లో... 
ఇరు సంధ్యల్లో వెలిగే ప్రమిదలు 
దైవమందిరం ప్రకాశం !

జయ మంగళగౌరీ దేవి 
దయ చూడుము చల్లని తల్లీ !
నవవధువుల వ్రతాలు 
కాటుక తయారీలు 
ముత్తైదువులకు వాయినాలు 
నాన బోసే సెనగలు.. 
పిల్లలు సందడి.. 
పసువు రాసిన పాదాలు!

ఒక ఘనతర ఆధ్యాత్మిక వేళ..

ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మా 
వరలక్ష్మి తల్లీ... !
అమ్మ గొంతులో ఎనిమిది దశాబ్దాలు 
మ్రోగిన పాట... 
ఈ శ్రావణమ్ లో దివినుండే... 
జ్ఞాపకాలు అనంతమూ,భారమూ.. 
ఆహ్లాదమూ !!


కామెంట్‌లు