కాంచీపురం విశిష్టత:---మచ్చ అనురాధ--తెలుగు భాషోపాధ్యాయురాలు-జి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.
సీస పద్యం
కాంచీపురము నందు  కామాక్షిదేవిగా 
వెలిసెను మా తల్లి వేదజనని,
శక్తి పీఠంబిది సాంబశివుడి తోడ
 కమనీయ దృశ్యము కనుల విందు,
మోక్ష విద్యకునిల మూలపీఠంబుగా
అద్వైత విద్యలు నలరెనిచట,
స్థాపించే పీఠము శంకరాచార్యులు
దేదీప్య మానమై దీప్తు లొలుక

తేటగీతి.
కంచి కామాక్షి యని వేడ కరుణ జూపు,
మధుర మీనాక్షి  యనిమ్రొక్క మనసు కరుగు,
పేరదేదైన  పిలిచినా పెన్నిధౌను,
జీవితమ్మందు దర్శింప జేరవలెను.

కందం.

చల్లని తల్లిని వేడగ
యుల్లములోతిష్టవేసియుండును తానున్,
అల్లన భక్తుల బ్రోవగ
నెల్లలు లేవిక జననికి  యేవేళైనన్ .


కామెంట్‌లు