సొరంగం:- ప్రతాప్ కౌటిళ్యా
 శూన్యంలో ఒక సొరంగం గుండా గాలి కదులుతోంది
 ఏది ఒకే ఒక బిందువు
 ఒక దగ్గర లేదు ఎందుకు

 ఆపైన ఆ సొరంగం గుండా నీరు ప్రవహిస్తుంది
 ఏది ఒకే ఒక బిందువు
 ఒక్క దగ్గర లేనేలేదు ఎందుకో

 అలాగే
 ఒక సొరంగం గుండా రంగు రంగుల కాంతి ప్రసరిస్తుంది
 ఏ రంగు కాంతి ఒకే ఒక బిందువు దగ్గర లేదు

 వలయంలో సుడిగాలిలో సుడిగుండంలో
 ఎంతోకొంత ఒత్తిడి సహజం
 ఎందుకని ఒక పరమాణువు అణువు పదార్థం
 స్థిరత్వం తత్వం కాదు
 అస్థిరత్వం ఆస్తికాదు
 అస్తిత్వం అంతా  
పరుదులమీద కదులుతున్నాయి!?
 
 శూన్యంలో విన్యాసం కాదు విస్తరిస్తున్న 
 మూల కణాల కదలికలు ఆపేఅవసరం లేని
 ఒకానొక వ్యవస్థ అర్థం చేసుకుంటే
 నిమిషంలో కాదు సెకండ్లలో
 విశ్వ రహస్యం రాసెయ్యెచ్చు!?

   విచ్చుకున్న నక్షత్రాల చిత్రాలు తీయొచ్చు
  గెలాక్సీల ఆకృతులు కనిపెట్టొచ్చు
  వీటిని ఆపేఅవధులు అవసరంలేదు 
 వాటికవే  వ్యవదులు  అవధులను మార్చుకుని
 కదులుతున్న కణాలు  అవి!?

 ఆ సొరంగంలో
   ఆకర్షణలకు అతీతంగా పారుతున్న 
  ఉనికి ఊహా చిత్రం కాదు
   నిజమైన నీడలు అవి!?
 ఆకర్షణలకు  పరిధులకు అవదు లకు ఆవల
 నిర్మాణాలు ఆకృతులు ఒకప్పటి సొరంగ మార్గాలు!?
 ఒక గొట్టం  గుండా గాలి నీరు కాంతి కదిలితే 
ఎలా ఉంటుందో అలా కదిలిన ఖగోళంలో 
 గోళాల గోల ఇది!?

 నిర్మించిన విస్తరించిన పదార్థం సృష్టించిన
   సొరంగరహస్యమే విశ్వ వీలునామా
 వలయం గోళం  గొట్టం నిండా
ఉన్న

ఉనికే  కనిపెట్టిన
 పుట్టిన ఈ  మట్టి !?!?!?

        pratapkoutilya
     ( K.pratapreddy) lecturer in Bio-Chem
8309529273,palem
కామెంట్‌లు