చిన్ననాటి ఆటలు (బాల గేయం)-పెందోట వెంకటేశ్వర్లు
పిల్లల ఆటలు చూడాలి
మక్కువ లెన్నో పొందాలి    
చిర్రగోనె,  చారు పత్తాలు 
కోకో , లంగోరి ఆటలు

మిత్రులను  పెంచుతూనే
 ఆటల నేర్పును చూపించు
ఇంటి బయట వీధి లోనా 
ఆటల పొట్లం  విప్పుమురా

కుస్తి చేస్తూ కర్ర సాములు 
తాడు దుంకుడు దాల్  దడీలు
ఐక్యతనెంతో పెంచును రా

ప్రతిభల  వెల్లువ అవునురా 
చెస్సు ఆటఆడిన తెలివి 
క్రికెట్ ఆట పరుగుల వేట 
బాలు క్యాచులు సిక్స్ కొట్టుడు


 పెందోట వెంకటేశ్వర్లు

కామెంట్‌లు