రాధాబినోద్ పాల్....అచ్యుతుని రాజ్యశ్రీ

 12నవంబర్ 1948లో జపాన్ లో 55మందిని  పి.ఎం.తోసహా క్రిమినల్స్ గా నేరంఆరోపించి కేసులు పెట్టడం జరిగింది. 11మంది  అంతర్జాతీయ జడ్జీలు28మందికి మృత్యుదండన విధించారు. కానీ ఒకేఒక వ్యక్తి  ఇదిఅన్యాయం అని అరిచాడు. ఆమహానుభావుడు రాధాబినోద్ పాల్ అనే భారతీయ జడ్జి. 1886లో తూర్పు బెంగాల్ లోని కుంభ్ లో పుట్టాడు. తల్లి ఒక ఆవుని పెంచుతూ దాని పాలు అమ్మి  సంసారం  ఈదుతోంది. రాధాబినోద్ ఆవుని మేపి ఇంటి పనుల్లో సాయపడేవాడు.  బడిబైటనించుని పాఠాలను వినేవాడు.ఒకసారి స్కూల్ ఇన్స్పెక్టర్ బడి తనిఖీ కి వచ్చాడు.  క్లాస్ లో అతని ప్రశ్నలకు పిల్లలు జవాబు చెప్పలేక పోయారు. కానీ బైట నించున్న రాధా టకటకా జవాబులు  చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచాడు. బడి పరిసరాల్లో  ఆవుని మేపుతూ పాఠాలను వింటున్నా  అని చెప్పిన ఆపిల్లాడిని స్కూల్ ఇన్స్పెక్టర్  వెంటనే  బడిలో చేర్చి స్టైఫండ్ ఏర్పాటు చేశాడు. కలకత్తా యూనివర్సిటీ లో ఎం.ఎస్సీ. చదివి  లా లో డాక్టరేట్ చేశాడు.  ఆయన టోక్యోలోని  ఇంటర్నేషనల్ కోర్టు లో ఇలా  వాదించారు "2వ ప్రపంచ యుద్ధం లో గెల్చిన వారే నిజమైన నేరస్తులు. న్యూక్లియర్ బాంబులతో20లక్షల మంది  జపనీయులను చంపిన క్రూరులు." అని వాదించారు. 1234పేజీలలో తన తీర్పు వెలువరించిన  రాధాబినోద్ పాల్ వారిని కాపాడాడు. మోడర్న్ ఫాదర్ ఆఫ్ ఇంటర్నేషనల్  హ్యుమానిటేరియన్  అని ఖ్యాతి గాంచాడు.1966లో జపాన్ చక్రవర్తి  కొక్కొకున్సావో అనే అవార్డుతో సత్కరించాడు. టోక్యో క్యోటో  అనే రెండు  నగరాలలో వీధులకి రాధాబినోద్ పాల్ పేరు పెట్టారు.టోక్యోలోని సుప్రీం కోర్టు ఎదురుగా ఆయన విగ్రహం ఇప్పటికీ  ఉంది.  ఆయన తీర్పు జపాన్  న్యాయ శాస్త్రంలో సిలబస్ గా పెట్టారు. 2007లో జపాన్ ప్రధాని  రాధా కొడుకుని కలిశాడు. డాక్టర్ రాధాబినోద్ పేరున  యాసుకుని ప్రాంతంలో ఒక మ్యూజియం ఉంది. జపాన్ యూనివర్సిటీ లో  రిసెర్చి సెంటర్ ఉంది. టోక్యో ట్రయల్ అనే హిందీ సినిమా ఆయన జీవితం ఆధారంగా తీసినదే!మనం ఇలాంటి  అపురూప వ్యక్తుల గూర్చి తెలుసు కోవాలి సుమా!
కామెంట్‌లు