అమ్మ,నాన్నల ప్రేమ: -రేవతి : రామరాజుపల్లి మండలం : దేవరుప్పులజిల్లా జనగాం

 ప్రాణం పోస్తుంది అమ్మ 
ప్రాణాన్ని కాపాడు తాడు నాన్న
ప్రేమిస్తుంది అమ్మ 
ప్రేమను పంచుతాడు నాన్న 
అమ్మ ప్రేమ గొప్పది 
నాన్న ప్రేమ నమ్మకమైన 
అమ్మ పేరులో ఉంది అమృతం
నాన్న పేరులో ఉంది నాదస్వరం 
అమ్మ లేని జీవితం అగాధం
నాన్న లేని జీవితం నరకం 
అమ్మ వంటి దేవత అవనిలో లేదు 
అమ్మ పిలుపులో అద్భుతం 
నాన్న పిలుపులో నా జ్ఞాపకం 
అమ్మ జోలపాడి గోరుముద్దలు పెడుతుంది 
నాన్న జోలపాటపాడి నిద్రపుచ్చుతాడు
పిల్లల ప్రేమకు దగ్గర అమ్మ 
పంట పొలాలకు దగ్గర నాన్న 
అమ్మ,నాన్న అంటే మాకిష్టం
అమ్మలో మొదటి పదం 'అ'
నాన్నలో చివరి పదం 'న'
అమ్మ,నాన్న తరువాత ఆ
అద్భుత దేవుడు ఆ అన్న 
సృష్టిలో కమ్మనైనది అమ్మ,నాన్నల ప్రేమ.
కామెంట్‌లు