సమస్యాపూరణం >డా.ఎన్.వి.ఎన్.చారి>పద్యకవి >హన్మకొండ *

 --------------------------------------------------------------
సమస్య*“జముననుఁ జూడఁగా విజయ శాంతి లభించె జయప్రదమ్ముగన్”*
-------------------------------------,,
పూరణ.*
-------------
క్రమమును దప్పు కౌరవ కిరాతక జూద ఫలంబె సోదరా 
సుమతరుశోభితాంగణవిశుద్ధ వనాంతర వాసమౌచునీ 
విమలమునీంద్రుసేవలులభించె మహాత్ము  ని దివ్యనేత్ర తే
జము, ననుఁ జూడఁగా విజయ !శాంతి లభించె జయప్రదమ్ముగన్
కామెంట్‌లు