చిత్రపద్యాలు - గంపలో భానుడు :-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
ఆట వెలదులు 

అస్తమించినాడు అందాల భానుడు 
శ్రామికులకు బువ్వ శ్రమలు తొలగి
రోజు కష్టమంత రూపాయిలయ్యెను 
 బంగరగుచు తాను బంతి వలెను!

అమ్మకముకు బెట్ట నమ్మరో భానుని 
ఎన్ని రూకలొచ్చు నెన్నగాను 
విశ్వమంత తానె వినువీధి కిరణాల
రవిని గాంచి కవియు రంజితమగు!


కామెంట్‌లు