*శ్రీకృష్ణుని ముత్యాల హారాలు*:- -- *రాథోడ్ శ్రావణ్*ముత్యాలహారం రూపకర్త


         దేవకీ మాత పుత్రుడు
        ఎనిమిదవ అవతారుడు
        నీలి మేఘ శ్యాముడు
        శ్రీకృష్ణ పరమాత్ముడు
       
యశోదా నందనుడు
చెరసాలలో పుట్టాడు
శ్రీకృష్ణా భగవంతుడు
ముంగిట ముత్యము వీడు
      కన్నయ్య జన్మదినం
     ఎనిమిదో సంతానం
     దేవుని పై అభిమానం
     మథుర బృందావనం
నల్లని రూపమున్నోడు
తెల్లని మనస్సున్నోడు
బంగారపు మోలతాడు
చిలిపి చేష్టల దేవుడు
     
     రాధకృష్ణుల ప్రేమలు
     జన్మజన్మల బంధాలు
     రాధతో సైఆటాలు
     హృదయ వేణుగానాలు
     
 
కామెంట్‌లు