రోడ్డు నిబంధనలు పాటించండి - సురక్షితంగా ఉండండి.("రాజశ్రీ" కవితా ప్రక్రియలో)(ఐదవభాగం):-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 17)
యమలోకపు ద్వారాలు తెరుచుకున్నాయి
ఎవరొస్తరా అని చూస్తున్నాయి
యమభటులు అటూఇటూ చూస్తున్నరు
ఎవరిని తీసుకెళ్దామాని నిరీక్షిస్తున్నరు!
18)
రాష్ డ్రైవింగ్ చేసేవారు
తాగి డ్రైవింగ్ షోకులోరు
హెల్మెట్ లేని వాడు
సీటుబెల్టు పెట్టుకోని వాడు!
19)
నిర్లక్ష్యపు నడక వాడు
నిర్లక్ష్యపు డ్రైవింగ్ ధీరుడు
ధూమ్ర పాన వీరులెవరు
మద్య పాన శూరులెవరు!
20)
యమభటులు అన్వేషిస్తూ ఉన్నారు
పరీక్షించి చూస్తున్నారు యములోరు
మనం అందులో ఒకరంగా
కాకుండా ఉందాం సురక్షితంగా!
(సమాప్తము)


కామెంట్‌లు