శహబాష్ శ్రీజ :- మొలక

 గత కొద్ది నెలలుగా పెద్దలతో పోటీ పడి పద్యాలను రాస్తున్న శ్రీజ కు ప్రత్యేక అభినందనలు . సుగుణ సాహితి సమితి సిద్దిపేట ఆధ్వర్యంలో   శనివారం  సిద్దిపేట మండల వనరుల విద్యా కేంద్రము లో  పద్య సాహిత్యం లోని పది ప్రక్రియ లలో విశేష ప్రతిభ కనబరిచి 400 కి పైగా పద్యాలు రాసిన  గుర్రాలగొంది గ్రామానికి చెందిన విద్యార్థిని బెజగామ శ్రీజ ను  ,  బాల కవయిత్రి శ్రీజ ను ప్రోత్సహించిన ఉపాధ్యాయ కవి  వరుకోలు  లక్ష్మయ్య ను జిల్లా  సెక్టోరియల్ అధికారి తాళ్లపల్లి రమేష్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుగుణ సాహితి సమితి  కన్వీనర్ భైతి దుర్గయ్య,జిల్లాలో ని కవులు,కవయిత్రులు,రచయితలు పాల్గొన్నారు.
కామెంట్‌లు