రాణీ జిందా! అచ్యుతుని రాజ్యశ్రీ

 పంజాబ్ కేసరి మహారాజా రణజిత్ సింహ్ రాణిజిందా ఒక వీరాంగన.క్రూర ఆంగ్లేయుల  వల్ల  ఆమె పడిన కష్టాలు ఇన్ని అన్నీకావు.1856 కల్లా కేవలం పంజాబ్ తప్ప దాదాపు  అన్ని చిన్న చితక రాజ్యాలు ఆంగ్లేయులకి దాసోహం అన్నాయి.రైలు టెలిగ్రాం సౌకర్యాలు వచ్చాయి.లార్డ్ డల్హౌసీ కాలంలో  పంజాబ్ అయోధ్య మొదలైన వాటిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. రంజిత్ సింహ్  బతికున్నంతకాలం అతని దగ్గర జీహుజూర్ అన్న  మంత్రులు  నమ్మకద్రోహం చేసి ఆంగ్లేయులతో చేతులు కలిపారు. ఖజానా లోని  12 కోట్ల రూపాయల లో కేవలం  అరకోటి మాత్రమే మిగిలింది. లార్డ్ హార్డింజ్ దాన్ని కాజేసి కాశ్మీర్ కూడా కావాలి అన్నాడు.
ఇక అసలు కథ మొదలైంది. రంజిత్ మిత్రుడైన జమ్మూ పాలకుడు రాజాగోపాల్ సింహ్   హార్డింజ్ కి  ఒక కోటి రూపాయలు ఇచ్చి  కాశ్మీర్ని కొన్నాడు.  అప్పుటికి  జిందా కొడుకు  దలీప్ సింహ్ చిన్న వాడు. జిందా (ఈమెను  చంద్రా అని కూడా పిలిచేవారు)
పరిపాలనాదక్షురాలు. కానీ ప్రధాని  గులాబ్ సింహ్ లోభి విశ్వాస ఘాతకుడు.వాడు  కొడుకు కూడా  ఆంగ్లేయులచేతిలో కీలుబొమ్మలుగా మారటంతో ఆంగ్లేయులు  జిందాని ఒక సామాన్య ఖైదీ లాగా షేక్పూర్ లో బందీగా ఉంచారు. ఆమె సోదరుడే స్వయంగా ఆర్డర్ తీసుకుని ఆమె దగ్గరకు వెళ్ళాడు. నీచులైన ఆంగ్లేయులు ఆమెపై కళంకం ఆపాదించారు. సర్ హెన్రీని  హత్య చేయాలని కుట్ర పన్నిందని ఆరోపించారు. పంజాబ్ ని ఆక్రమించాలనే  దుర్బుద్ధితో ఆమె కొడుకు చేత రాజముద్రవేయించి  ఆజ్ఞాపత్రాన్ని ఆమెకి చూపారు. నిస్సహాయురాలైన ఆమె  పంజాబ్ ని విడిచి ఫిరోజ్పూర్ ఆపై కాశీలో ఒక ఆంగ్ల ఆఫీసర్  ఆధీనంలో ఉంచబడింది. పంజాబ్ అంతా అట్టుడికిపోయింది. శిక్కుసేనాపతి  షేర్ సింహ్ గర్జించాడు  "మన తల్లి లాంటి  మన మహారాణీని  ఆంగ్లేయులు ఎలా అవమానం చేస్తున్నారో  చూస్తూ కూచున్నాము.మన తల్లిపై అత్యాచారం  అవమానం తో ఆమెని చిత్రహింసలు పెడుతూనే ఉన్నారు. " ఈవిషయం విన్న  కాబూల్ కి
చెందిన అమీర్ మహ్మద్ ఖాన్ కి బాధ వేసి  ఆంగ్లేయులకి ఘాటుగా లేఖరాశాడు."రాణీని  బంధించి  సిక్కుల  మనోభావాలు దెబ్బతీయవద్దు."ఐనా  దున్నపోతు పై వర్షం కురిసింది అన్న చందం.దలీప్ సింహ్ ని కూడా  గద్దె దింపి ఫతేగఢ్ లో ఉంచారు. అతని నగలు దుస్తులతో సహా 20లక్షలవి ఊడలాక్కున్నారు.ఏడాది కి 4-5లక్షల పెన్షన్  ఇస్తామని చెప్పి  80వేలు చేతిలో పెట్టారు. అప్పటికి  దలీప్ వయసు కేవలం  11ఏళ్ళు మాత్రమే. సర్ జాన్ లాజిన్  కస్టడీలో ఉంచారు. 1853లో క్రైస్తవునిగా మార్చారు. 1857లో భారత దేశం రావాలని విదేశంలో ఉన్న  దలీప్ 16ఏళ్ల వాడు ఎంతో  తపించాడు.తనవారికి లేఖ రాశాడు "ఏముఖం పెట్టుకుని  భారత్ రాగలను?పంజాబ్ లో ఒక మామూలు బిచ్చగాడు గా బతకాలి అని ఉంది. ఖాల్సా సోదరులారా!నేను తిరిగి శిక్కుగా మారాలి అని వాహ్ గురూని వేడుకుంటున్నాను.నేను మహా పాపిని కాబట్టి  భారత్ ని  నా మాతృభూమి  పంజాబ్ ని చూడలేక పోతున్నాను." పంజాబ్ ఖజానా  కోహినూర్ వజ్రం తో సహా ఆంగ్లేయులు  ఊడలాక్కున్నారు. పాపం!మహారాణీ జిందా  వృద్ధాప్యంలో  కంటి చూపు పోగొట్టుకుని కొడుకు దగ్గరకు వెళ్ళింది.1863లోదలీప్ కొడుకు  ఒడిలో  తలపెట్టి  శాశ్వత నిద్రలోకి  ఒరిగింది. పంజాబ్ కేసరి మహారాజా భార్య  ఆతని కొడుకు  దుర్దశ తల్చుకుంటే  కంటనీరు తిరుగకమానదు.
కామెంట్‌లు