తెలుగువెలుగు-సాహితీసింధుసరళగున్నాల
తే.గీ*అసలుసిసలైనతెలుగుకున్నాశలూది
తెలుగుభాషకు పట్టంపువెలుగువెలుగ
గెలుపుబాటనుపట్టిన గిడుగురామ
మూర్తిపంతులు జిలుగులస్ఫూర్తినింపె

తే.గీ*అమృత సమమైనభాషయే ఆంధ్రమనగ
కాంతిపుంజమై వెలుగులశ్రాంతినిడుచు
కవుల కలమున మధురంపు చవులునింపి
పాఠకాళినిమెప్పించి పంచెసుధలు

తే.గీ*తేనెలొలుకుచు తీపుల ధీయశమ్ము
రసనగ్రోలంగనామధురంపుతెలుగు
వెలుగులీనుచు కలమందు జిలుగుపంచు
ఆంధ్రభాషకు సరితూగనవని లేదు

కామెంట్‌లు