జటాయువు (కైతికాలు):-*కాటేగారు పాండురంగ విఠల్*గరుడ వంశమునపుట్టె
నిత్య సత్య వ్రతుడు
సీతను కాపాడుటకు
రావణుని ఎదిరించాడు
వారెవ్వా!మహా బలశాలీ!
జన్మ ధన్యమే జటాయువా!

రావణుని హితము కోరి
ధర్మము బోధించాడు
సీతమ్మను అపహరిస్తే
మరణము తప్పదన్నాడు
దుష్టులు మంచి గ్రహించరు!
నీతి మాటలు తలకెక్కవు!

నీవు లంకాధీశుడవు
ఆదర్శంగుండాలి!
నీతి తప్పకుండా
ధర్మము పాటించాలి!
రావాణా!సీతను వదిలిపెట్టు!
నీ ప్రాణాలు రక్షించుకో!

రామునితో పోరాడు
అతనిని జయించుము!
దొంగ వ్యవహారమొద్దు
చూపించు నీ ప్రతాపము!
రావాణా!నా మాట వినుము!
ప్రాణాలు రక్షించుకొనుము!

నువ్వొక సామాన్య పక్షి
నన్నేమీ చేయలేవు!
శరవృష్టి కురిపించెను
నన్ను నీవు చంపలేవు!
జటాయువా!అడ్డు తప్పుకో!
చావు కొనితెచ్చుకోకు!

తీవ్రంగా పోరాడెను
రావణునెదిరించాడు
రథాన్ని అడ్డగించి
కిందికి తోసేశాడు
బాహుబలి!దశకంఠుడు!
సీతతో కిందికి దిగాడు!

ముక్కుతో గోళ్ళతో
రావణుడిని రక్కాడు!
సువిశాల రెక్కలతో
ముప్పుతిప్పలు పెట్టాడు!
ఒకచేత్తో సీతను పట్టె!
మరోచేత్తో జటాయువును నరికె!

సీత దుఃఖము చూచి
రక్షించ దలిచాడు!
కోపం ఆవేశంతో
తలపైన పొడిచాడు!
కత్తితో మరో రెక్క నరికెను!
రాక్షసుడు!రావణాసూరుడు!

సీతను రక్షించదలచి
ప్రాణాలకు తెగించాడు!
రామ భక్తినే చాటి
తనువునే అర్పించాడు!
అయ్యో!పక్షి రాజా!
ధన్యుడవు జాటాయువా!


కామెంట్‌లు