గురు తేగ్ బహదూర్...అచ్యుతుని రాజ్యశ్రీ

 9వగురువు తేగ్ బహదూర్  6వసిక్కు గురువైన హరగోవిందుని చిన్న కొడుకు. 1621లో అమృతసర్ లోపుట్టిన ఇతను బాల్యం నించి విరాగియే!8వగురువు హరకిషన్ ఆదేశంతో గురు పీఠం ఎక్కినా "నేను త్యాగ్ ని"అని ప్రకటించాడు. తల్లి  బంధుమిత్రుల  బలవంతంతో గురువైనా తామరాకుపై నీటి బొట్టు లా ఉండేవాడు. ధీరమల్ అనే కుళ్ళుబోతు రక్తసంబంధీకుడు తనే గురువుకావాలని తపించేవాడు.తేగ్ ని చంపేప్రయత్నాలు ఎన్నో చేశాడు. ఒక వ్యక్తి ని ప్రత్యేకంగా  తేగ్ ని చంపమని నియమించాడు.
ఆగూండా తనచేతికి చిక్కినాకూడా  క్షమించాడు తేగ్.  దుష్టులకు దూరంగా ఉండాలి అని తేగ్  కొండప్రాంతాలలోకెళ్లి  ఆనందపుర్ అనే పేరుతో  ఆప్రాంతం ని  అభివృద్ధి చేశాడు.అక్కడ కూడా శత్రువు  వెన్నంటి రావటంతో లాభం లేదని దేశాటన ప్రారంభించాడు.మాలవా బాంగడ్ మొదలైన ప్రాంతాల లో సిక్కుమతప్రచారం గావించాడు.బావులు చెరువులు తవ్వించాడు.ఆగ్రా  గయ  అలహాబాద్ మొదలైన చోట్లకి యాత్రలు చేశాడు. పట్నాలో ఔరంగజేబు సేనాని రాజా జయసింహుని  సిక్కు మతం స్వీకరించేలా చేశాడు.   అతనితో కలిసి అస్సాం చేరాడు.మొగల్ సైన్యం కి అడ్డుతగిలాడు.రక్తపాతంనించి కాపాడాడు.ఒక మట్టి దిబ్బదగ్గర  శాంతిఒప్పందం కుదరటంతో గురు నానక్ పేరు తో ఒక మఠాన్ని నెలకొల్పాడు.
పట్నాలో తేగ్ భార్య గోవింద రాయ్  అనే పుత్రుని ప్రసవించింది. ఔరంగజేబు  అత్యాచారాలు  పెచ్చుపెరగటంతో పంజాబ్ లో శాంతిస్థాపనకై నడుం బిగించాడు.కాశ్మీర్ పండితులు  ఆయనని కలిసి హిందువుల పై జరుగుతున్న దారుణ కాండని వివరించారు.అప్పుడు చిన్నారి గోవింద 9ఏళ్ళ వాడు."నాన్నా!ఎందుకు అంత దిగులుగా ఉన్నావు?" "బాబూ!కాశ్మీరం అంతా అల్లకల్లోలంగా ఉంది. ఔరంగజేబు అత్యాచారాలతో హిందువులు నానా అగచాట్లు పడుతున్నారు. నేను  బలిపశువైతేగాని ప్రజలలో చైతన్యం రాదు." "నాన్నా!మరి త్వరగా బైలుదేరు.నేను అమ్మ ని చూసుకుంటాను."ఆపసివాడి మాటలు తేగ్ ని కదిలించాయి.వెంటనే  కాశ్మీర్ పండితులను పిలిచి "నేను  ఔరంగజేబు ని కలిసి మీసమస్యను పరిష్కరిస్తాను.నేను  ముస్లిం గా మారుతా అని భరోసా ఇస్తా.మీరు ఖంగారు పడకండి".
1675లో ఢిల్లీ వెళ్ళాడు. ఖచ్చితంగా తేల్చి చెప్పాడు "నేను ముస్లిం గా మారను."అంతే ఆయన తలతెగి కింద పడింది. ఆయన మెడలో  ఒక అట్టను వేలాడేసుకుని మరీ వెళ్ళాడు. అందులో  ఇలా  రాసుంది "నాశిరస్సుని కోల్పోతానని నాకు తెలుసు. కానీ  నా హిందూ ధర్మం ని కోలుపోను."
సిక్కుల  ఆత్మాభిమానం  కర్తవ్యపరాయణత శౌర్యప్రతాపాలను రగిల్చిన తేగ్ బహదూర్ ఆదర్శ గురువు.మాటలు కాదు చేతల్లో   చూపిన తేగ్ కొడుకు ని కూడా  తన లాగే తయారు చేసిన  తండ్రి!సిక్కుల చరిత్ర చదివి తే  కళ్లవెంబడి కన్నీరు కారుతుంది.మనం వారిని గూర్చి తెలుసుకుని తీరాలి.
కామెంట్‌లు