*కలియుగం* :-: యెల్లు అనురాధ రాజేశ్వర్ రెడ్డి తెలుగుభాషోపాధ్యాయులుజడ్.పి.హెచ్.ఎస్ కుకునూరుపల్లి-సిద్దిపేట

 సుందరమైన భారతదేశం
 సుమధురమైన ప్రకృతి వాసం
 మూడుదిక్కుల ముత్యాలతీర్థం
 అభివృద్ధితో రాజ్యం భోజ్యం
:: సుందర::
 ముక్కంటికీ మహావిష్ణువుకు
 అర్థం కాని అయోమయం
 స్వార్థం ఎంతో పెరిగెను నేడు
 మంచి చెడులు మరిచెనునేడు
:: సుందర::
 అనుబంధాలు ఆప్యాయతలు
 అంతరంగమున మమతలు అన్ని
 ఎండమాయే అవుతా ఉండెను
 వాత్సల్యము ఆవిరి అయ్యేను
:: సుందర::
 అంతర్జాలం ఆయుధమయ్యేను
 సెల్లు ఫోనులే ఆత్మీయులయ్యెను
 టవర్ లతోనే దేశం నిండెను
 మనిషి మనుగడ ఆగ మాయను
:: సుందర::

కామెంట్‌లు