గిడుగు తాత:-సత్యవాణి
గిడుగు తాత తెలుగెంతో
తేలికైనది
పసిపాపల నోటకూడ పలుకు తీయగా
హాయయి హాయిగా

కఠినపదములనూ
వలదన్నాడు
జనపదులకందుబాటు 
కాదన్నాడు

సరళమైన తెలుగులోనె
చదువన్నాడు
నిశ్శేషము నిశానీలు 
అపుడన్నాడు

ప్రతి ఇంటను తెలుగు భాష
వెలిగిన నాడు
అజరామరమగు భాష అగున్నాడు

తెలుగు వ్రాయ చదువగాను
వచ్చిననడే
ఆధ్రుడనే మాటకు
అర్థముండును
పరమార్థముండును

             

కామెంట్‌లు