కొలిమి:- సత్యవాణి

 నువ్వెంత
నీ బ్రతుకెంత
నీ యెక్కువేంటి
నాతక్కువేంటి
నీ సంపాదనెంత
నా సంపాదనముందు
నీవాళ్ళు తుఛ్ఛులు
మీవాళ్ళు ముఛ్ఛులు
నీ లెక్క నాకేమిటి
నాపక్కన  నువ్వొద్దంతే
నా యిల్లు నా యిష్టం
నా పిల్లలు నాయిష్టం
నీ చావు నువు చావు
నేను చచ్చికూడా నిను సాధిస్తాను
మాటల ములుకులు
మంటలలో మనసులు బస్మం
ఇటవంటి యిల్లు
నిప్పుల కొలిమి
వారి వారి అసూయా ధ్వేషాలూ
పగలూ ప్రతీకారాలే
ఆ కొలిమిని మండించే యింధనాలు
అటువంటి యింటిలో
వాతావరణ కాలుష్యం
శబ్ద కాలుష్యం
దిగులు కాలుష్యం
దీనినుంచి బయట పడే మార్గం
అవగాహప
ఆత్మ పరిశీలన
దిద్దుబాటు చర్యలు
అనుకూలస్తే
ఆ యిల్లే నందనవనం
భూతల స్వర్గం
          
కామెంట్‌లు