రామప్పవైభవం;-సాహితీసింధు సరళ గున్నాల
కం*అరుదైనవారసత్వము
సరిపోల్చగనేదిలేదు శంభునిగుడినిన్
పరీపరివిధముల యోచన
పరిగెత్తగవచ్చెగురుతు పరికింపంగన్

కం*రామప్పశిల్ప సంపద
ఆమనివెల్గులనుపంచు నరుదైనదిదే
యేమనిపొగుడుదు శిల్పుల
నేమమ్మునగట్టిరిచట నేర్పరితనమున్

ఆ.వె*రాతిగోడలందు రమ్యమౌచిత్రాలు
కనులముందు నిలిచి కాంతిపంచ
చూడవచ్చువారు చూపుదిప్పకెటకు
వారసత్వమనియు వాసికెక్కె

ఆ.వె*శిల్పకళనుజూడ చేరగారామప్ప
చూపుదిప్పనీదు చూపరులకు
కాకతీయరాజు కట్టింపకోవెల
వారసత్వమనియు వాసికెక్కె

కామెంట్‌లు