*అక్షర మాల గేయాలు* *సంయుక్తాక్షర గేయం క- ఒత్తు*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం*

 కనిష్క పుట్టిన రోజంటా
పొద్దు పొద్దున్నే లేచింది
చక్కగా తలను దువ్వుకుంది
చమ్కీల గౌను తొడుక్కుంది
జట్కా బండిని ఎక్కింది
అక్కతో బజారు కెళ్ళింది
బిస్కెట్ పుడను కొనుక్కుంది
మర్కటం దానిని చూసింది
ఉర్కొచ్చి లాక్కుని పోయింది
ఉలిక్కిపడి కోతిని చూపుతూ
అక్కకు చెప్పి  వెక్కివెక్కి ఏడిచింది

కామెంట్‌లు