*"కొందరి" నవ్వులు*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 *నీరజ్ చోప్రా నవ్వు!*
 క్రీడా దీక్ష ఫలించి!
 వందేళ్ళకు ఒక్కడై నిలిచి!
టోక్యో లో చరిత్ర లిఖించి!
2020 ఒలింపిక్స్ పసిడి గెలిచి!
 మన బల్లెం *బాహుబలి*!
 *నీరజ్ చోప్రా*,
             *పసిడి నవ్వు దీప్తి!*
  దిగంతాలకు విస్తరించిన,
               *భారత్ ఘనకీర్తి!*
38. అమ్మ నవ్వు అభిమానం!
       నాన్న నవ్వు ప్రోత్సాహం!
      మిత్రుని నవ్వు ఉత్సాహం!
      పుత్రుని నవ్వు ఉల్లాసం!
39. గురువు నవ్వు!
       ఆదేశం!
       ఆత్మవిశ్వాసం!
       ఆశీర్వచనం!
40.ప్రియురాలి నవ్వు ప్రేమ!
      ఇల్లాలి నవ్వు క్షమ!
      కూతురి నవ్వు కలిమి!
     మనుమని నవ్వు బలిమి!
41.కోడలి నవ్వు!
      వంశమంతటికి వెలుగు!
      ఆనందం వెల్లివిరియు!
      ఆత్మీయత పొంగిపొరలు!
42.అల్లుని నవ్వు!
      అందరి నవ్వు!
      ఆనందం రువ్వు!
      ఆప్యాయత ఇవ్వు!
43.వెలయాలి నవ్వు!
      ఎడారిలో మరీచిక!
      ధర్మపత్ని నవ్వు!
      బతుకు దారిలో,
              మలయవీచిక!
         (కొనసాగింపు)

కామెంట్‌లు