చిత్ర కవిత > మహిళా స్పూర్తి .*డా.కె.ఎల్.వి.ప్రసాద్> హన్మకొండ .

 మూకుమ్మడి పయనం
ముదితల బాధ్యతా రాగం
సంసార సాగరం ఈదడంలో
వారి కి వారే సాటి ఇది నిజం....!
ఉచితాలకు ఎగబడని
ఆత్మగౌరవం ఎరిగిన ఆడపడుచులు,
సోమరి పోతులకు దూరంగా ఉండే ,
కష్ట జీవులు కదావాళ్ళు ...!
కష్టంలోనే సుఖాన్ని ఆస్వాదించే ,
వనితామూర్తులు వాళ్లు ...
భవిష్యత్తును ....
ఆశాజనకంగా మలుచుకోగల
ఆదర్ష మహిళా మణులు వాళ్ళు !
యావత్ జాతికే ' మాదిరి' కదా వాళ్ళు !!
కామెంట్‌లు