వీర హమీర్! అచ్యుతుని రాజ్యశ్రీ

 1303లో అల్లాఉద్దీన్  చిత్తౌడ్ పై దాడి చేసినప్పుడు  వేలాది మంది రాజపుత్రులు మృత్యువు ఒడిలో ఒరిగారు.  అరిసింహుడనే రాణా ఎంతో పోరాడాడు.అతని పుత్రుడు హమీర్. అరిసింహుడు చందనవంశానికి చెందిన  ఒక సామాన్య  రాజపుత్రికను పెళ్ళాడాడు.ఆపిల్ల  గొప్పతనం ఏమిటోతెలుసా? ఒక చిన్న బల్లెంతో  బలమైన పందిని చంపింది.అలాగే  అరిసింహుని గుర్రం మోకాలిని విరిచేసింది. అతని మిత్రుడిని  గుర్రం మీంచి కింద పడేసింది. అది చూసిన రాణా ఆమెని వలచి పెళ్ళాడాడు.  అందాల మహారాణి పద్మినిని పొందాలనే కాంక్షతో  అల్లాఉద్దీన్  చిత్తౌడ్ పై దాడి చేశాడు.
రాణా కైలబారా అనే ప్రాంతంలో ఉన్నాడు.  హమీర్ అప్పటికే యోధునిగా ఖ్యాతి గాంచాడు. "హమీర్!నాశత్రువైన భిల్లసర్దార్ ముంజర్ తల నరికి తీసుకుని రా!"రాణా మాటను వెంటనే అమలు పరిచాడు. వెంటనే రాణా  తన రక్తంతో తిలకం దిద్ది తన వారసునిగా ప్రకటించాడు. అతని  ఇతర భార్యల కొడుకులు  అసూయ తో రగిలిపోయారు. ఒకడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకోడు దక్షిణంవైపు తరలిపో యాడు.1305లో హమీర్ మేవాడ్ రాణా అయ్యాడు. ఖజానా ఖాళీ గా ఉంది. బలైచార్ అనే రాజ్యం పై దండెత్తి  పసేలియా అనే దుర్గాన్ని  వశపర్చుకున్నాడు. చిత్తౌడ్ ని కాపాడే ఏకైక రాణా హమీర్  అనే విశ్వాసం  ప్రజలకు కలిగినది. అరిసింహుడు చనిపోయాడు. హమీర్ దాదాపు 60ఏళ్ళు  యుద్ధాలలోనే మునిగి పోయాడు.  ఎట్టిపరిస్థితిలోనూ  చిత్తౌడ్ ని పరాధీనం కానీ యను అని ప్రతినబూనాడు.దీనికో ఉపాయం ఆలోచించాడు. "నామీద నమ్మకం ఉన్న వారు సపరివారంగా  మేవాడ్ సరిహద్దులలో  కాపలాగా  అడ్డుగోడ గా నిలబడండి.అలా చేయకుంటే  వారు  దేశ ద్రోహులు గా  భావింపబడుతారు."అంతే మేవాడ్ ని వదిలి సరిహద్దుల్లో చేరారు.గొరిల్ల దాడిలో ఆరితేరారు అంతా. హమీర్ చెరువు తవ్వించి దాని గట్టుపై మేవాడ్ గ్రామదేవతను ప్రతిష్టించాడు.జనం జేజేలు పలికారు. చిత్తౌడ్ రక్షణ బాధ్యత వహించే మాల్దేవ్  తన కూతురిని పెళ్ళాడమని ఆహ్వానించాడు.అంగీకారం తెలిపి హమీర్  500మంది ఆశ్వికులతో వెళ్ళాడు. స్వాగత సత్కారాలు లేవు.కానీ మాల్దేవ్  తన కూతురిని  అతనికి అప్పగించాడు. వధువు అతని కాళ్ళపై బడి"స్వామీ! నేనొక బాలవితంతువుని.పసిపాప గా నాపెళ్లి భట్ వంశ రాకుమారునితో జరిగింది. అతను యుద్ధం లో మరణించాడు. మనలో వితంతు వివాహం తప్పు గదా?అందుకే మానాన్న  ఇలా చేశాడు. " ఆపిల్ల పై ప్రేమ  గౌరవం పెరిగిన హమీర్  భార్య గా స్వీకరించాడు.వారికి ఒక కొడుకు పుట్టాడు.  హమీర్  తన మంచితనం సామర్థ్యం తో చిత్తౌడ్ ని  దారిలోకి  తెచ్చి  పట్టు బిగించాడు. మాల్దేవ్  చిత్తౌడ్ ని తనకు ఇప్పించాలని  ముబారక్ ఖిల్జీని ఆశ్రయించాడు.అతని పీచం అణచి హమీర్  చిత్తౌడ్ కి పూర్వ వైభవం తెచ్చాడు.బాబర్ దండయాత్ర దాకా తిరుగులేని చిత్తౌడ్  రాజ్యం చరిత్ర లో నిలిచింది. హమీర్  చరిత్ర లో  నేటి కీ అమరుడు సజీవుడు.
కామెంట్‌లు