సీతాకోక చిలుక-సాహితీసింధు సరళ గున్నాల
కం*పచ్చనిసీతాకోకలు
విచ్చినయాపూలసొగసు వెలుగులునింపన్
వచ్చియు మధువును గ్రోలుచు
నచ్చునుచూపరులకెపుడు నగవులునింపన్

కం*అందాలరంగులెన్నియొ
చిందించగ విందుజేయు సీతాకోకల్
నందనవనసీమందున
పొందికతో మధువుగ్రోలు పుడమిన వింతై

కం*టపటప రెక్కలనూపుతు
కపటమ్ముయెలేనిజీవి కలిసి యుగమందున్
రెపరెప లాడగజీవన
మపనమ్మకమంతవీడి హాయిగనుండున్

కం*జీవనపోరాటమ్మున
నేవిరులుకనగ మధురిమ నేగియుగొనుచున్
తావియునందినజాలని
జీవితగమ్యమ్ముదెలుపు సీతాకోకా


కామెంట్‌లు