శ్రీ కృష్ణుడి బాలగేయాలు;- సత్యవాణి

 చిన్ని కృష్ణునీ చూడండీ
పీతాంబరమును కట్టేడు
మువ్వల మొలతాడెట్టాడు
మెడలో హరాలేసాడు
కరమున వేణువు పట్టాడు
నుదుట తిలకమును దిద్దాడు
తలలో పింఛము పెట్టాడ
          *********
అష్టమ తిదినీ పుట్టాడు
అసురులెందరినొ పడగొట్టేడు
కంసమామను చంపాడు
తల్లి తండ్రి చెర విడిపించాడు
మధురా నగరమునేలాడు
మాధవ దేవుడు అయినాడు
         ********
గొల్లవారి వాడలకు పోయినాడట
గోవు పొదుగు పాలన్నీ
కుడిచినాడట
ఉట్టిలోని వెన్నకుండ
పడగొట్టినాడట
గోపబాలలందరికీ
పంచినాడట
గోపవనిత పట్టవస్తె
గోడ దుమికినాడట
   ********
ఉట్టి కొట్టినాడట
మా చిన్ని కృష్ణయ్య
చట్టిలు పడగొట్టినాడట
వెన్న చట్టిలు పడగొట్టినాడట
            
కామెంట్‌లు