రక్షాబంధన్....అచ్యుతుని రాజ్యశ్రీ..

 రాఖీ పండుగ పిల్లలు పెద్దలు ఉత్సాహం గా జరుపుకుంటారు.జంధ్యాల పౌర్ణమి అని పెద్దలు ఆరోజు‌ కొత్త జందెం ధరిస్తారు.ఒడుగు అయినాక‌ మొగపిల్లలు గురుకులానికి వెళ్లి విద్యలన్నీ నేర్చి  గురుదక్షిణ ఇచ్చి ఇల్లు చేరేవారు.శ్రీకృష్ణపరమాత్మ కుచేలుడు. సాందీపముని  ఆశ్రమం లో కలిసి చదివి పెద్ద అయినా ఆ ప్రేమ ఆప్యాయత మరువని గొప్ప స్నేహితులు. ఇంకా రాఖీ అంటే రక్ష అని అర్థం.
పురాణ గాథలు ఎన్నెన్నో ఉన్నాయి.ఇంద్రుడు యుద్ధం చేసి అలసిఓడి పోతుంటే శచీదేవి భర్తీకి రక్ష కట్టింది.మన పరిభాషలో ఇప్పుడు తాయెత్తు అంటున్నాము. దిష్టి తగలకుండా పిల్లల కి మెడ నడుం చేతికో తాయెత్తు కడతారు.ఆరోగ్యం కోసం  ధనం కోసం  తాయెత్తు కడతామని డబ్బు దోచుకునే  దొంగ స్వాములు బైలుదేరారు.తస్మాత్ జాగ్రత్త.నమ్మి మోసపోవద్దు. బలిచక్రవర్తి దగ్గర ఉన్న భర్త ను వైకుంఠం తీసుకుని పోవటం కోసం లక్ష్మీ దేవి రాక్షస రాజు కి "నేను నీ సోదరిని. నాభర్తను నాకు ఇవ్వు' అని అతనికి రాఖీ కట్టింది.అలెగ్జాండర్ కి ప్రాణభిక్ష  పెట్టమని రుక్సానా పురుషోత్తమునికి రాఖీ కట్టినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.
 ఇంకా రాజపుత్ర రమణులు  తమ మాంగల్య రక్ష కై‌ తాము ఆపదలో ఉన్నప్పుడు అండగా ఉండి కాపాడమని వీరు సోదరులకు రక్షా బంధనం కట్టడం ఆచారం గా ఆనవాయితీగా మారింది.విదేశీ దండయాత్రలు  తురుష్కుల దురాగతాలు తో  ఉత్తర భారతం చిరిగిన విస్తరి అయింది.రాజులు రాణాలు‌‌
తమ ప్రాణాలు పణంగా పెట్టి మహిళలను కాపాడారు.వనితలు కూడా సైనికులు రాజులకు రక్షా బంధనం పంపి తమ సోదరులను కాపాడే ప్రయత్నం చేశారు. ఇప్పుడు రక్తసంబంధం లేకున్నా ఆడ మగ పిల్లలు రాఖీలు  కట్టి మిఠాయిలు తినిపించి మైత్రి బంధం  నిలుపుకునే  ప్రయత్నం చేయటం ముదావహం.
కామెంట్‌లు
Sasikala Kamandula చెప్పారు…
Chakkaga cheppaaru rajasri garu. Ammalo sagamnannalo sagam anipinche anna, talli la preminchi valla santhosham korukune akka chelleu... Anna chellela bandham saati lenidi. Naku ee pandaga ante chaala ishtam.