కృష్ణాష్టమి( చిన్న కథ.)-తాటికోల పద్మావతి గుంటూరు.

 పద్మనాభం గారు ఉయ్యాల బల్ల ఊగుతూ ఉన్నారు. మూడో తరగతి చదువుతున్న మనవడు వచ్చి తాతయ్య రేపు కృష్ణాష్టమి అంటున్నారు అంటే ఏమిటి తాతయ్య కృష్ణుడు పుట్టిన రోజు కదా నాకు చెప్పవా అన్నాడు.
ఓరి బడవా నీకు కృష్ణుడి గురించి తెలుసుకోవాలనుందా అయితే ఇలా రా వచ్చి నా పక్కన కూర్చో అంటూ మనవడిని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు.
కంసుని చెల్లెలు దేవకీదేవి ఆమె భర్త వసుదేవుడు వారికి పుట్టిన ఎనిమిదవ సంతానం వలన కంసుడుకి మృత్యు గండం ఉన్నదని తెలిసి భయపడ్డాడు. దేవకీవసుదేవుల లో చెరసాలలో బంధించారు. పుట్టిన ప్రతి బిడ్డను ఖడ్గం తో సంహరించాడు. ఎనిమిదవ బిడ్డ పుట్టగానే చెరసాలలో తలుపులు తెరుచుకున్నాయి ఆ బిడ్డను గంపలో పడుకోబెట్టుకుని యమునా నదిని దాటుకుంటూ వెళ్లి యశోదాదేవి పక్కన పడుకోబెట్టి ఆమెకు పుట్టిన ఆడపిల్లను తీసుకొని మళ్లీ తిరిగి వచ్చారు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. కంసుడు వచ్చి అష్టమ సంతానాన్ని సంహరించ బోతుండగా ఆ ఆడపిల్ల ఆకాశంలో మాయమై పోతుంది నిన్ను సంహరించే వాడు పెరుగుతూనే ఉన్నాడని చెప్పి మాయమైపోతుంది. కృష్ణుడు యశోద దగ్గర అ పెరుగుతూ ఉంటాడు. బాల్య లీలలు చెప్పనలవి కాదు దొంగిలించడం గోపికల పాలకుండల పగలగొట్టడం అల్లరి చేస్తే తల్లి నోటికి కట్టి వేస్తుంది ఆ రోటి తో సహా పక్కన ఉన్న చెట్లను పడ వేసినప్పుడు ఆ చెట్టు లో నుంచి ఇద్దరు పురుషులు బయటికి వస్తారు. మా శాపాన్ని తొలగించి మళ్లీ మిమ్మల్ని మా రూపం మాకు వచ్చేటట్లు చేశావని మెచ్చుకుంటారు. యమునా నదిలో కాళీయమర్దనం చేస్తాడు ఆ విషసర్పం నుండి ఆ నీటిని కాపాడతాడు. రాళ్ల వర్షం కురిసిన అప్పుడు గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికెన వేలితో ఎత్తి ప్రజలను కాపాడతాడు ఈ విధంగా కృష్ణుని మాయలు చెప్పనలవి కావు ‌ పెరిగే కొద్దీ బృందావనంలో ఆట పాటలు గోపికలును అల్లరి చేయటం వంటివి చేస్తాడు . అందరి ఇళ్ళలో వెన్నను దొంగిలి స్తాడు. యశోదాదేవి తన కొడుకు చేష్టలను చూసి మురిసిపోతుంది. కృష్ణుడికి బలరాముడు అన్న ఉంటాడు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా పెరుగుతుంటారు. కృష్ణుని మేనమామ కంసుడు తన తల్లిదండ్రులను చెరసాలలో బంధించాడు అన్న విషయం తెలుసుకొని వాళ్ళని విడిపించడానికి బయలుదేరుతాడు. బలరామకృష్ణులను కథ మార్చుటకు మల్ల యుద్ధం ఏర్పాటు చేస్తారు ద్వారకలో కువలయ పీడము గజరాజు అడ్డు పడగా శ్రీకృష్ణుడు ఒక్క చేతితో తొండ ముని పట్టుకునే నేలకేసి కొడతాడు అది కింద పడి దొర్లుతూ ప్రాణాలు విడుస్తుంది. కృష్ణ బలరాముల ను చంపుట అంత సాధ్యం కాదని కంసుడు నిర్ణయించుకుంటాడు శ్రీకృష్ణ బలరాముల అద్భుత లీలలు చూసి ప్రేక్షకులు ఆనందముతో పొంగిపోయారు. దేవకీవసుదేవుల సంతానమును బయటికి గెంటి వేయమని చెప్పగా శ్రీకృష్ణ భగవానుడు వేగంగా ఎగిరి కంసునితో యుద్ధము చేసి హరించును.
ఆ తర్వాత తన తల్లిదండ్రులు కు మేము నేను మీ ప్రియ పుత్రులను ఎల్లప్పుడూ మిమ్మల్నే తలుచు చుంటి మి.
జననీ జనకులు తమ సంతానమునకు జన్మనిచ్చే గాక వారి లాలన పాలనలో కూడా చూచెదరు విధి వశమున మేము మీ దగ్గర అ ఉండే అదృష్టం లేదు. ఇప్పటికైనా నా మీరు నన్ను తీసుకుంటామని తల్లిదండ్రులను ఉత్తర వ్యామోహంలో వేసారు. దేవకీవసుదేవులు బలరామకృష్ణులను తమ సంతానం గానే భావించారు. శ్రీకృష్ణ భగవానుడు జగత్తుకే ప్రభువు అని పరమానందము పొందుతున్నారు మధురలో నందుడు మొదలగు గోపాలులను జేరి గోకులం చేరుకొన్నారు. అనంతరము బలరామకృష్ణులకు విద్య నభ్యసించుటకు ఉజ్జయిని నగరానికి పంపారు. కొలది కాలములోనే శ్రీకృష్ణ బలరాములు సాందీపని వద్దా విద్యలను నేర్చుకొనీ మధుర కు వచ్చారు.. శ్రీకృష్ణుని మాయలు అన్నీ ఇన్నీ కావు. అంటూ కృష్ణుని వృత్తాంతమును బాలయ్య చేష్టలను వివరిస్తూ చెప్పుకొస్తాడు తాతయ్య.. కృష్ణాష్టమి అంటే కృష్ణుడి పుట్టినరోజు. దేవాలయాల్లోనూ ఉట్టి కొడతారు. కృష్ణుడికి ఇష్టమైన వెన్న పాలు అటుకులు నివేదన చేస్తారు. ఇంతవరకు నీకు అర్థం అవుతుంది. పెద్దవాడివి అయ్యాక అన్ని తెలుసుకుంటావు లే అన్నాడు తాతయ్య. ఇంక చాలు తాతయ్య నాకు నిద్ర వస్తున్నది అంటూ పక్కనే పడుకుని నిద్ర లోకి జారుకున్నాడు. పిల్లలకు ఇప్పటి నుంచే రామాయణం భారతం భాగవతం లాంటివి చెబుతూ ఉంటే అర్థం చేసుకోగలరు అనుకున్నాడు తాతయ్య

కామెంట్‌లు