అచ్చులతో అమ్మ పై కవిత:--- మచ్చ అనురాధ-తెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.

 అమ్మ అనురాగాల బాట
ఆనందాల  మూట
ఇంటి పనులన్నీ తాను చేసినా ,
ఈసు  యిసుమంత లేక
ఉన్నంతలో ఉన్నతంగ  ఎలా బ్రతుకాలో,
ఊపిరి యున్నంత‌వరకూ
ఋణ బాధలు  ఎన్ని ఉన్నా,
ఎంతో ధైర్యం తో
ఏమరుపాటు లేక
ఐకమత్యం తో కుటుంబాన్ని,
చూసుకుంటూ,
ఒక్కొక్క విషయాన్ని
ఓర్పుతో గ్రహించి
ఔషధం  లాంటి మాటలను  చెబుతూ,
అందరికీ ఆశీస్సులు అందించే 
అమ్మే  ఆది దైవమూ, 
అమృత  భాండమూ .

కామెంట్‌లు