విద్యాభ్యాసం. తాటి కోల పద్మావతి గుంటూరు

 .
ఉదయం స్నానం పూజానంతరం కొద్దిగా ఆహారం స్వీకరించాలి పండ్లు పాలు మొదలైనవి ఆరోగ్యానికి మంచిది. వీటివల్ల విద్యలో ప్రధానమైన నా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సమయ నియమాలను పాటిస్తూ చదవాలి. ఒక ఉపాధ్యాయుని శిక్షణలో చదవాలి. చదువు పుస్తకంలో కొంతే ఉంటుంది. ఉపాధ్యాయ శిక్షణలో మరి కొంత వస్తుంది. తోటి విద్యార్థుల ద్వారా మరికొంత అబ్బుతుంది. ఇంకా మిగిలిన విద్యను కాలక్రమంలో నేర్చుకోవాలి. అని పెద్దలు చెబుతారు.
చదివిన చదువు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు పనికి వస్తుంది. అందుకే ఉద్యోగం కోసం కాకుండా జ్ఞానం పెంచుకోవడానికి చదవాలని పెద్దలు చెబుతారు. చిన్నప్పుడు అర్జునుడు సంగీతం నిత్యం నేర్చుకున్నాడు. తరువాతి కాలంలో రాజ్యం కోల్పోయి విరాట రాజు వద్ద అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు ఈ నాట్యం సంగీతాలే అర్జునునికి సహాయపడ్డాయి.
ఇంతే కాదు సహ విద్యార్థులను హింసించ రాదు. వివాదాలకు పోయి శత్రువులుగా తయారు కారాదు. గురువు శ్రేయోభిలాషి కనుక వారి మాటను జవదాట రాదు. ఇలా పాటించే అర్జునుడు మహావీరుడు అయ్యాడు.
అన్నిటికన్నా ముఖ్యం ఆరోగ్యకరమైన స్పర్ధ. స్పర్థయా వర్ధతే విద్య అన్నారు పెద్దలు. స్పర్ధ ఉన్నప్పుడే విద్య అభివృద్ధి చెందుతుంది. పోటీపడి నేర్చుకోవాలని ఎవరు ఆశిస్తారో వారు తప్పక విజయం సాధిస్తారు. అశ్వద్ధామ చీకట్లో బాణాలు వేయడం నేర్చుకున్నాడు. అతనితో పోటీపడి అర్జునుడు కూడా ఆ విద్య నేర్చుకున్నాడు. స్పందించవచ్చు కానీ తోటి విద్యార్థుల పై అసూయ పడరాదు. వారి ప్రగతి చూచి కుళ్ళు ఈర్ష్య పడరాదు.
గురువు వద్ద నిజమైన వినయ విధేయతలు పాటించాలి తప్ప దొంగ వినయం దొంగ బుద్ధులు చూపరాదు.
మంచి గురువు వద్ద విద్యాభ్యాసం వినయ విధేయతలతో నేర్చుకుంటే వారి జీవితం ఆదర్శప్రాయం.

కామెంట్‌లు