వార్తాపత్రిక కై ఎదురుచూపును వర్ణించుట;-మమత ఐల-కరీంనగర్

 ఉ.
ఎల్లరు తెల్లవారగనె నెంతగ చూదురొ గుమ్మమందునన్
కొల్లల వార్తలన్ చదువ కొంచము మించిన కాలమందునన్
పిల్లడు పేపరిచ్చుటకు వేగిరమందున చేరవచ్చినన్
మెల్లగ వచ్చినావనుచు మిక్కిలి కోపము జూపుచుందురే
వార్తాపత్రిక
ఉ.
ఆత్రుతగా నెచూచెదరు హాయిగ నింటికిచేరు వార్తకై
పత్రిక బాలుడేడియని వార్తల నెల్లనుజూచువారలై
చిత్రము లన్ని పొందుగను చేరెడి పత్రిక రాకపోయినన్
యాత్రకు వెళ్ళువారివలె నాగము చెందెదరచ్చుదాకనే

కామెంట్‌లు