భగవద్గీత(కైతికాలు):--*కాటేగారు పాండురంగ విఠల్*
ఇంద్రియాదులన్నిటిని
నిగ్రహించిన వాడు
ఎన్నటికి ఏ వస్తువును
పరిగెర్శించని వాడు
పార్థా!ఆశ లేనివాడు
పాపమును పొందాడు!

శరీరధారణ చేత
జీవ క్రియలు చేసినచో
చేయవలసిన రీతిలో
కర్మలను చేసినచో
పార్థా!బంధింప బడడు
మోక్షము పొందగలడు

అప్రయత్న పూర్వకంగ
కర్మలను చేయువాడు
లభించిన దానితోనే
సంతుష్టిని పొందువాడు
పార్థా!కర్మ చేసినను
బంధింపబడడు!

శీతోష్ణాది ద్వంద్వములు
విడిచిపెట్టు వాడు
సుఖము దుఃఖములను
లెస్సగా దాటిన వాడు
అర్జునా!ఎప్పటికీ కర్మలతో
బంధితుడు కాలేడు!

ఫల ప్రాప్తాప్రాప్తియందు
కోరిక లేని వాడు
కార్య సిద్ధి అసిద్ధిలో
సమభావమున్న వాడు
పార్థా!మాత్సర్యము లేనివాడు
జ్ఞాన యోగి అనబడును!


కామెంట్‌లు