తప్పులు-ఒప్పులు;-కటుకం రాజయ్య
కం:గతమున జేసిన తప్పులు
     మతిదప్పియుజేయబోకు మరువక యెపుడున్
      సతతము జేయుట వలనను
      పతనము నయ్యెటి సమయము పక్కగ వచ్చున్!!

భావము:ఓ మానవా! నీవు ఇదివరకు చేసిన తప్పులను మరిచిపోయి కూడా చేయకుము. చేసిన తప్పులనే ఎల్లప్పుడూ చేయడం వలన నీ వ్యక్తిత్వం పతనమయ్యి నిర్వీర్యమైపోతావు.కావున చేసిన తప్పు పనులను ఎట్టి పరిస్థితులలోనైనా తిరిగి చేయకుము.

కామెంట్‌లు