సమస్య-సాహితీ సింధు సరళ గున్నాల
జనన మరణాలు దప్పవు జగతిపైన

తే.గీ*అతిగసంపాదన కొరకు నాశపడుచు
తప్పుదోవన నడిచిన ధర్మమెటుల
నిలుచు?భువిపైన నుందవా నేరమనక
జననమరణాలు తప్పవు జగతి పైన

తే.గీ*ఈర్ష్య ద్వేషమ్ములెక్కువై యిలను నిలిచి
మోసపుచ్చగ డబ్బుపై మోజుచేత
బంధు

బలగమనకను రాబంధులైన
జనన మరణాలు దప్పవా జగతి పైన

తే.గీ*అంత మనునది యెరుగని యాశతోడ
తోడ బుట్టినవారిని దోచుకొనిన
కోట్లు యనునవి వెంటను గొనగలేము
జనన మరణాలుదప్పవు జగతిపైన

కామెంట్‌లు