*రాఖీ-సాక్షి*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 *రక్షాబంధన్/రాఖీ శుభాకాంక్షలతో*
1.ఆడపిల్ల రక్షణ కరువు!స్వాతంత్య దినంసాక్షిగానిలువు
 మానం ప్రాణం మంట కలువు!
 అమ్మానాన్నల బతుకు ఇక,
                      కన్నీటి చెరువు!
 ఇది నేటి కళ్ళముందు దృశ్యం!
 సభ్యసమాజం కళ్ళు తెరవాలి,
                            అవశ్యం!
2.మనిషి మృగమవుతాడు!
   కామానికి దాసుడవుతాడు!
  బుద్ధి తప్పి భ్రష్టుడవుతాడు!
   పతనానికి పట్టం కడతాడు!
  వ్యసనాల దారి పడతాడు!
  మంచి మనిషి కనుమరుగు!
3.ఏడకో గౌరవంగా వెళ్ళాల్సిన,
                          ఆడపిల్ల!
    అమ్మ ప్రతి రూపం,
       ఆప్యాయత చంద్రబింబం!
  రెండు కుటుంబాల వారధి!
  ఇరవై ఒక్క తరాలకు,
             పుణ్యమిచ్చే పెన్నిధి!
  పసుపు, కుంకుమ;
  గాజులు,పూలకి పొంగిపోయి!
  కలకాలం కన్నఇంటి క్షేమం,
                కోరుకుంటుంది!
4.శ్రావణపౌర్ణమి నాడు ఆమె,
   సోదరునికి కట్టే రక్షాబంధనం!
   ఆమె జీవితాన ఆపద,
     చొరనీయని రక్షా కవచం!
  భద్రతపున్నమి వెలుగులు,
        నింపే మణి కంకణం!
 అలెగ్జాండర్కి లొంగిపోయిన 
పురుషోత్తముడు రాఖీవలననే!
రాఖీఉన్న ప్రతి పురుషుడు
కర్తవ్యంసాక్షిగాపురుషోత్తముడై,
ఆడపిల్లభద్రతకై నడుంకట్టాలి,
ఆడపిల్ల! అమ్మ! అమ్మవారు!

కామెంట్‌లు