వరలక్ష్మి:-మమత ఐల-కరీంనగర్

 కం
వరముల నొసగే తల్లిని
శరణన్నను చాలు వచ్చు శరవేగమునన్
తరణులు ఘనముగ కొలచే
వరలక్ష్మికి స్వాగతమని పలికెను మమతా
కం
జన హృదయమె నీ కోవెల
ఘనముగ కొలువుండవమ్మ గౌరీ మాతా
వినయము తోపూజించెడి
వనితల దీవించుమమ్మ వరదాయినివై

కామెంట్‌లు