శూన్యం:-సత్యవాణి

 అతడొక విప్రవినోది
అతడి చేతికి తగిలించివున్న సంచీ ఒక మాయాబజారు
అతడి చేతిలలోగల 
పొట్టి వెండిపిడికల కర్ర ఒక మాయాదండం
జలయక్షిణీ
మహేంద్రజాల యక్షిణీ అంటూ
మంత్రదండంతో 
సంచీపై తట్టుతూ
లోన చెయ్యి పెట్టి 
గుప్పెట బయటకు తీసి
మంత్రదండంతో తట్టి
గప్పెటతెరచి
అద్భుతం చూపిస్తాడు
సూన్యంనుంచి సృష్టిమొదలుపెట్టిన బ్రహ్మలా
విప్రవినోది
విచిత్రాలు సృష్టిస్తాడు
వింత వింతలు 
కనులకు కట్టిస్తాడు
శూన్యంనుండి
వినోదం సృష్టించగల
విప్రబ్రహ్మ అతగాడు
                  
కామెంట్‌లు